రూ. 31లక్షల ఎరువులు సీజ్
విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉంగుటూరు, భీమడోలు, ద్వారకా తిరుమల మండలాల్లోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల షాపులను తనిఖీ చేశారు. గోద్రేజ్ ఆగ్రోవెట్ను తనిఖీ చేసి రూ. 31. 15లక్షల విలువైన ఎరువులను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సీ అండ్ డీఏ ఏడీఏ విజయప్రసాద్, విజిలెన్స్ సీఐ విల్సన్, భీమడోలు ఏడీఏ పి. ఉషా రాజకుమారి, ఎంఏవోబి. వెంకటేష్, గొల్లగూడెం వీఆర్వో పాల్గొన్నారు.