Feb 24, 2025, 09:02 IST/బోథ్
బోథ్
బోథ్: పట్టభద్రులను ఓటు అడిగే అర్హత బీజేపీకి లేదు
Feb 24, 2025, 09:02 IST
ప్రతి యేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాటలు చెప్పి మోసం చేసిన బీజేపీ వారికి ఓట్లు అడిగే అర్హత లేదని మాజీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. సోమవారం తలమడుగు మండలం సాయిలింగిలో ఆయన పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నేడు పట్టభద్రులను ఓటు అడిగే అర్హత బీజేపీ పార్టీకి లేదని విమర్శించారు.