తాళ్ళపూడి - Tallapudi

తాళ్లపూడి: నవదుర్గ ఆలయంలో శతచండీ యాగం

తాళ్లపూడి మండల కేంద్రంలో వెంచేసియున్న శ్రీ నవదుర్గ సహిత కనకదుర్గ ఆలయంలో ఎంతో ఘనంగా చేపట్టిన శత చండీ యాగం, మహాకుంభాభిషేక ఉత్సవానికి సోమవారం నుండి శ్రీకారం చుట్టారు. దీని కోసం ప్రత్యేక రీతిన నిర్మించిన యాగ శాలలో అమ్మవార్ని అలంకరించి, ముగ్గులతో తీర్చి దిద్దారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం శ్రీ సిద్దేశ్వర శ్రీ శివాచార్య కార్తికేయ నిర్వహణలో యాగ శాల ప్రవేశం, గణపతి, గోపూజ, పుణ్యాహవచనం కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నీలి కుటుంబీకులు, భక్తులు పాల్గొన్నారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా