రెండో ప్రపంచయుద్ధం సమయంలో బ్రిటిషర్లు ఈ బెలీ బ్రిడ్జ్‌లను అభివృద్ధి చేశారు. వీటిలో ఉపయోగించే పరికరాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా సరఫరా చేయొచ్చు. వాటిని అసెంబుల్ చేయడానికి ప్రత్యేక టూల్స్ అవసరం ఉండదు. ప్రకృతి విపత్తు సమయంలో తాత్కాలిక నడకమార్గాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ వంతెనలను రూపొందించిన బ్రిటిష్ వార్ ఆఫీస్‌లోని సివిల్ సర్వెంట్ డొనాల్డ్ బెలీ పేరుమీదుగా వాటిని అలా పిలుస్తున్నారు.