కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల నుంచి ఏపీలో రెడ్ బుక్ టాక్ విపరీతంగా వినిపించింది. ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన గుడ్ బుక్ కాన్సెప్ట్ ఇప్పుడు రెండు పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ కోసం కష్టపడే వారి పేర్లతో గుడ్ బుక్ రాసుకుంటున్నానని జగన్ చెబుతున్నారు. గుడ్ బుక్‌లో రాసుకున్నవారందరికీ భవిష్యత్‌లో అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయని నేతలకు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.