వైనాట్ 175 అన్నది 2024 ఎన్నికల కోసం వైసీపీ ఇచ్చిన ఒక స్లోగన్. అయితే ఆ స్లోగన్ పవర్ ఏమీ లేదని జనాలు తేల్చేశారు. ఏకంగా 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు చూస్తే వైసీపీ వచ్చే ఎన్నికల కోసం అప్పుడే పెద్ద టార్గెట్ పెట్టుకుంటోంది. నిన్న కాక మొన్న ఎన్నికలు జరిగాయి. కానీ వైసీపీ మాత్రం వచ్చే ఎన్నికల కోసం భారీ లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగుతోంది. వై నాట్ 215 అని కొత్త నంబర్ తో వైసీపీ న్యూ స్లోగన్ ని బయటకు తీసింది.