ఈడీ విచారణకు హాజరైన మహ్మద్ అజహరుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కు ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అజహర్ మాట్లాడుతూ తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని చెప్పారు.