నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత

83చూసినవారు
నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఆర్‌పీఎఫ్ బలగాలతో జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. మావోయిస్టుల హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాలు, నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 22 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో నిరంతర భద్రత కల్పిస్తారు.