
జిటెక్స్ ఆఫ్రికా 2025లో పాల్గొన్న ఇండియా
భారతదేశం ఆఫ్రికాలోని అతిపెద్ద టెక్, స్టార్టప్ ప్రదర్శన అయిన జిటెక్స్ ఆఫ్రికా 2025లో పాల్గొంది. ఈ కార్యక్రమం మొరాకో రాజధాని మరాకెష్లో జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్ నుంచి ప్రతినిధిగా నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలశాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్పులను, ఈ-కామర్స్, హెల్త్‌కేర్ రంగాల్లో వచ్చిన పురోగతిని ఆయన వివరించారు.