TG: నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెంలో రూ.500 నకిలీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. నార్కట్పల్లి-అద్దంకి రోడ్డు వెంట ఉన్న ఓ పొలంలో రూ.20 లక్షల కట్టలను రైతులు గుర్తించి కొన్నింటిని తీసుకెళ్లారు. ఆ నోట్లపై 'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' అని ముద్రించి ఉంది. స్థానిక సీఐ వీరబాబు ఘటనా స్థలికి చేరుకొని మిగతా నోట్లకట్టలను సీజ్ చేశారు. వీటిని ముద్రించినవారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.