యూపీలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభామేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే అక్కడికి చేరుకోలేని కొందరు డిజిటల్ స్నానం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువతి పవిత్ర స్నానం చేయడానికి మహా కుంభామేళాకు చేరుకుంది. అయితే అక్కడికి రాలేని తన కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేసి ఫోన్‌ను మూడు సార్లు నీటిలో ముంచి తీసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.