శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు రోజురోజుకు కష్టంగా మారుతోంది. ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. లోపల పేరుకుపోయిన మట్టి, శిథిలాల ఎత్తు మరో మీటరు మేర పెరిగిపోయింది. దానికితోడు నీటి ఊట ఆగకుండా కొనసాగుతోంది. కాగా కేంద్ర ప్రభుత్వం తరఫున విపత్తుల నిర్వహణ, ఉపరితల రవాణా శాఖలకు చెందిన నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం మంగళవారం ఉదయానికల్లా టన్నెల్ వద్దకు చేరుకునే ఛాన్స్ ఉంది.