ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'పుష్ప-3' సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ తెలిపారు. విజయవాడలో జరిగిన 'రాబిన్ హుడ్' చిత్ర ప్రెస్ మీట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో వేరే సినిమా చేస్తున్నారని ఆయన తెలిపారు. అల్లు అర్జున్-సుకుమార్ 'పుష్ప-2' రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.