రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. వీరిలో తెలంగాణలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అటు ఏపీలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని, మరొకరు గల్లంతయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 200లకు పైగా మూగజీవాలు వరదలో కొట్టుకుపోయాయి.