భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 229 ఇంజినీర్ పోస్టులకు వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ కేటగిరీలో పోస్టులున్నాయి. BE/B.Tech/ B.Sc ఇంజినీరింగ్ పాసై, 28 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులు. నెలకు రూ.40,000- రూ.1,40,000 జీతం ఇస్తారు. డిసెంబర్ నెలాఖరులో ఆన్లైన్ పరీక్ష జరగనుంది.