25 మంది తమిళ జాలర్లు అరెస్ట్

75చూసినవారు
25 మంది తమిళ జాలర్లు అరెస్ట్
తమిళనాడుకు చెందిన 25 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ తాజాగా అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లోకి వచ్చారనే ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకుంది. ఆ మత్స్యకారులంతా నెడుండివు సమీపంలో చేపల వేట సాగిస్తున్న సమయంలో శ్రీలంక నేవీ వచ్చింది. నాలుగు బోట్లతో పాటు మత్స్యకారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. తరచూ శ్రీలంక నేవీ ఇలా చేస్తుండడంతో తమిళ మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you