కౌంటింగ్‌ కేంద్రం వద్ద 4 అంచెల భద్రత: సీఈవో

65చూసినవారు
కౌంటింగ్‌ కేంద్రం వద్ద 4 అంచెల భద్రత: సీఈవో
కౌంటింగ్‌ కేంద్రం వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని సీఈవో వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. కౌంటింగ్‌ ఏజెంట్ల వద్ద, సిబ్బంది వద్ద కూడా సెల్‌ఫోన్లు ఉండకూడదని, కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్‌ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఈ నెల 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.