ప్రతి ఏడాది జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నిజానికి జూనోటిక్ వ్యాధుల గురించి, వాటిని ఏవిధంగా నివారించాలి అన్న అంశాలపైన అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం. అసలు జూనోసిస్ అంటే జంతువుల నుంచి ప్రజలకు వ్యాపించే అంటువ్యాధులు అని అర్ధం. పశువైద్యుల నిర్వచనం ప్రకారం గీకు పదమైన 'జూనోసెస్ 'అంటే 'జూన్' అంటే జంతువు, 'నోసోస్' అంటే అనారోగ్యం అని అర్థం వస్తుంది.