ఒడిశాకు చెందిన దీపక్, సీతారాణిలు రెస్టారెంట్లు నిర్వహస్తున్నారు. వీరు ఉండే ప్రాంతంలో భవన నిర్మాణ కూలీలే ఉంటారు. వారి పిల్లలంతా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుంటారు. దీంతో పేద విద్యార్థుల కోసం లైబ్రరీని తెరిచారు. కోవిడ్ సమయంలో స్కూళ్లన్నీ మూతపడటంతో గ్రామాల్లో పర్యటించి విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ ఉచితంగా అందించారు.2021లో కోచింగ్ సెంటర్ స్థాపించి 105 మందికి ఉచితంగా చదువు చెప్తున్నారు.