ప్రతిభ ఎవరి సొంతం కాదనే నానుడిని నిజం చేసి నిరూపించాడు 12వ తరగతి విద్యార్థి. గ్వాలియర్‌కు(MP)కి చెందిన మేధాన్ష్ త్రివేది ఐదేళ్లపాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్‌ను తయారు చేశాడు. అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారీ చేశాడు. దీనికి MLDT 01 అని పేరు పెట్టారు. ఇది 60kmph వేగంతో 80kgs బరువు గల వ్యక్తిని ఆరు నిమిషాల పాటు గాల్లో మోయగలగదు. 3 నెలల పాటు శ్రమించి రూ.3.5లక్షల వ్యయంతో ఈ డ్రోన్‌ను సృష్టించారు.