యూపీలో భారీ పేలుడు సంభవించింది. ఇవాళ వేకువజామున టీలా మోడ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని భోపురా చౌక్ వద్ద గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కులో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలడంతో అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పేలుడు ధాటికి పలు ఇళ్లు ధ్వంసం కాగా, వాహనాలు దగ్ధమయ్యాయి.