స్వల్పంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

73చూసినవారు
స్వల్పంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను స్వల్పంగా తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 తగ్గించాయి. ఈ నిర్ణయంతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,797కి చేరింది. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.5 తగ్గి రూ.2,023కి చేరింది. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. తెలంగాణలో రూ.855, ఏపీలో 827.50గా ఉంది.

సంబంధిత పోస్ట్