గత వారం రోజులుగా మధ్యప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పెళ్లి నుంచి ఇతర కార్యక్రమాల సన్నాహాలపై కూడా వర్ష ప్రభావం పడింది. ఇదే సమయంలో భారీ వరదలతో రోడ్లపైకి నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జబల్‌పూర్‌లోని షాపురాలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. వరద నీటి మధ్య బంధువుల భుజాలపై వరుడు స్వారీ చేస్తూ రోడ్డు దాటాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.