కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి ప్లాన్ చేసిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన రేపు (శుక్రవారం) ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.