బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శనివారం సీఎం రేవంత్‌తో సమావేశమయ్యారు. దీంతో కృష్ణారెడ్డి
కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా, 2014లో
టీడీపీ నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణారెడ్డి.. 2018లో సబితా ఇంద్రారెడ్డి(
కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు.