మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కలిదింవి ఫణికుమార్ (40) బుడమేరు వరదనీటిలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఫణికుమార్.. వినాయకచవితి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లారు. శనివారం గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రం తిరిగి మచిలీపట్నం బయల్దేరాడు. విజయవాడ మీదుగా వెళ్లాలని స్థానికులు చెప్పినా వినిపించుకోలేదు. కేసరపల్లి- ఉప్పులూరు- కంకిపాడు మీదుగా వెళ్తానంటూ దూసుకొచ్చి బుడమేరు వాగు వరద నీటిలో చిక్కుకున్నాడు.