ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడు గంటల పాటు పర్యటించారు. భారీ వర్షం పడుతున్నా.. వరద నీటిలో ఆయన పర్యటించారు. భవానీపురం, సితార సెంటర్, చిట్టి నగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. సింగ్ నగర్లో ఇంకా వరద నీరు తగ్గకపోవడంతో ప్రొక్లెయినర్ ఎక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు సయితం చంద్రబాబు వెళ్లారు.