విజయవాడలో ఓ సాఫ్ట్‌వేర్ యువతి సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.1.25 కోట్లు పొగొట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి సదరు యువతికి ఫోన్ చేసి తాను ముంభై పోలీసు అని, మీకు వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్ ఉందని, అరెస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో కంగారు పడిన యువతి అతడికి పలు దఫాలుగా రూ.1.25 కోట్లు పంపింది. అనంతరం మోసపోయినట్లుగా గ్రహించి శుక్రవారం రాత్రి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.