బీహార్ రాజధాని పట్నాలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై ట్రాక్టర్ మొరాయించడంతో ల్యాండ్ కావాల్సిన ఇండిగో
విమానం దాదాపు 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. రన్‌వేపై ట్రాక్టర్‌తో గడ్డి కోస్తుండగా సడెన్‌గా మొరాయించింది. దీంతో సిబ్బంది 20 నిమిషాలు శ్రమించి దానిని క్లియర్ చేశారు. ఆ సమయంలో కోల్‌కతా నుంచి పట్నా వస్తున్న
విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా గాల్లోనే చక్కర్లు కొట్టింది.