తమిళనాడులోని అలంకార్ థియేటర్‌పై దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా రూపొందిన అమరన్ మూవీలో తమ వర్గానికి వ్యతిరేకంగా సన్నివేశాలున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌పై బాంబు దాడికి పాల్పడ్డారు. బాంబు దాడి దృశ్యాలు అక్కడున్న సీసీ ఫుటేజ్‌లో నమోదు కావడంతో పోలీసుల విచారణ చేపట్టారు.