ఆదిలాబాద్ లోని టిటిడిసిలో నిర్వహించిన జన విజ్ఞానవేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబురాల ముగింపు వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. నిత్యజీవితంలో సైన్స్ ప్రాముఖ్యత ఎంతో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. సైన్స్ వెనుక దాగి ఉన్న విషయాలను అర్థం చేసుకోవాలని సూచించారు. డీఈఓ ప్రణీత, తదితరులున్నారు.