TG: సంధ్య థియేటర్ కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. 'పుష్ప- 2' ప్రీమియర్ షోకు క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని.. హీరో, హీరోయిన్, చిత్ర యూనిట్ రావొద్దని థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల మాట వినకుండా వచ్చిన అల్లు అర్జున్.. అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పీపీ కోర్టుకు తెలిపినట్లు తెలిసింది.