UPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు.. క్లారిటీ

62చూసినవారు
UPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు.. క్లారిటీ
UPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు ఉంటాయన్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని.. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. PPI పైనే ఛార్జీలు ఉంటాయంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్