సినీ నటుడు మంచు మనోజ్ జనసేనలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. సోమవారం ఆళ్లగడ్డ వచ్చిన ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని అన్నారు. “ఈ రోజు మా అత్తయ్యగారి జయంతి. అందుకోసమే కూతురు దేవసేన శోభను ఆళ్లగడ్డ తీసుకొచ్చాం. మా కుటుంబం, సోదరులు, స్నేహితులతో కలిసి ఇక్కడకు వచ్చా. ఊళ్లో ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకున్నారు. రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులకు థ్యాంక్స్’’ అని మనోజ్ అన్నారు.