
ALERT: మార్చి నుంచే వడగాలుల ప్రభావం
AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు ఉగ్రరూపం దాల్చాడు. మహా శివరాత్రి తర్వాత వేడి, ఉక్కపోత మరింత పెరగనుంది. మార్చి 2 లేదా 3వ వారంలోనే రాష్ట్రంపై వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్-జూన్ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. కొద్దిరోజులుగా కోస్తాంద్ర, విశాఖ, నరసాపురం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల పెరుగుదల నమోదైంది.