ఇచ్చోడ: కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు
కారు బోల్తా పడటంతో ఇద్దరికి గాయాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ కు చెందిన బాలు, సాయిలు ఆదిలాబాద్ లో జరిగే శుభకార్యానికి బయలుదేరారు. ఇచ్చోడ సమీపంలోని అగ్నిమాపక కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. అందులో ఉన్న ఇద్దరికి గాయాలు కావడంతో వారిని 108 సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.