శ్రీలంక ప్రధానిగా మరోసారి అమరసూర్య

59చూసినవారు
శ్రీలంక ప్రధానిగా మరోసారి అమరసూర్య
శ్రీలంక ప్రధాన మంత్రిగా మరోసారి హరిణి అమరసూర్య నియామకమయ్యారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే సోమవారం ప్రకటించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షుడు దిసనాయకే నేతృత్వంలోని వామపక్ష కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రి వర్గాన్ని సోమవారం నియమించారు. ఈ క్రమంలోనే పీఎంగా హరిణికి మరోసారి అవకాశం కల్పించారు. విదేశాంగ మంత్రిగా సీనియర్ నేత విజితా హెరాత్‌ను నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్