నేడు ఏ పని జరగాలన్నా ఆధార్ తప్పసరి. అయితే ఆధార్ నమోదు సమయంలో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా పడితే మార్చుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. అటువంటి వారికి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ మార్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఇచ్చే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. ఇది అమల్లోకి వస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవు.