పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెల్డంగాలో కార్తీకపూజ మండల్ సమీపంలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుపై ఒక కమ్యూనిటీని కించపర్చేలా అభ్యంతరకరమైన సందేశం రాయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.