వల్లభనేని వంశీ ఇంట్లో ముగిసిన ఏపీ పోలీసుల సోదాలు

74చూసినవారు
వల్లభనేని వంశీ ఇంట్లో ముగిసిన ఏపీ పోలీసుల సోదాలు
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు ముగిశాయి. దాదాపు 2 గంటలపాటు హైదరాబాద్‌లోని వల్లభనేని వంశీ నివాసంలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. వంశీ ఫోన్‌ కోసం ఇంట్లో విస్తృతంగా గాలించారు. వంశీ ఇంట్లో ఫోన్‌ లభించకపోవడంతో విజయవాడ పోలీసులు వెనుదిరిగారు. చివరిసారి వంశీ ఇంట్లోనే సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ చూపించడంతో ఈ తనిఖీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్