జున్ను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జున్నులో శరీరానికి కావాల్సిన విటమిన్లు డి, కె, బి12, క్యాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త పోటు కూడా కంట్రోల్ అవుతుంది. ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం లేదు. జున్నులో ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మలబద్ధకం, అజీర్తి, గ్యాస్, కడుపులో నొప్పి, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి.