గర్భవతితో ఆస్పత్రి బెడ్ శుభ్రం చేయించిన సిబ్బంది (VIDEO)
మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి మరణించిన బెడ్‌ను ఐదు నెలల గర్భవతి అయిన మృతుడి భార్య చేత ఆస్పత్రి సిబ్బంది శుభ్రం చేయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.