మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బద్లాపూర్‌లో ఉన్న ఓ పాఠశాలలో 4ఏళ్ల ఇద్దరు చిన్నారులపై.. టాయిలెట్ క్లీన్ చేసే స్వీపర్.. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికెళ్లిన చిన్నారుల్లోని ఓ బాలిక.. తన ప్రైవేటు భాగాల వద్ద తీవ్రమైన నొప్పి ఉందని.. తల్లిదండ్రులకు చెప్పింది. ఇక మరో బాలిక స్కూలుకు వెళ్లేందుకు భయపడింది. దీంతో ఆ ఇద్దరు బాలికలను డాక్టర్ వద్దకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా.. వారిపై లైంగిక వేధింపులు జరిగినట్లు ధ్రువీకరించారు.