హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన పదేళ్ల బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఆనంద్ అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురానికి తీసుకెళ్లాడు. పెద్దాపురంలోని ఓ అద్దె గదిలో నిర్బంధించి, ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు బాలికను గుర్తించి రక్షించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.