పనస గింజలతో తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పనస గింజల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఒమేగా 3, ఒమేగా 6 వంటి వాటితో పాటు A, C, E, B విటమిన్లు.. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పనస గింజలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్ధకాన్ని నివారించడానికి ఇది మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది.