సంక్రాంతి పండుగ కానుకగా ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు పసుపు బోర్డును అందించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి రైతుల పండుగ అని, తొలిసారిగా ఢిల్లీలో సంక్రాంతి వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, ప్రముఖ సినిమా నటుడు చిరంజీవి కూడా పాల్గొన్నారు.