అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థలపై సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) మూడు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం కారణంగా వచ్చే మూడేళ్లపాటు SECI నిర్వహించే బిడ్డింగ్‌లలో కంపెనీ పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.