రేపు బ్యాంకుల‌కు సెల‌వు.. ఎక్క‌డంటే?

63చూసినవారు
రేపు బ్యాంకుల‌కు సెల‌వు.. ఎక్క‌డంటే?
రేపు (జ‌న‌వ‌రి 23) నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీర్ సురేంద్ర సాయి జయంతి కావ‌డంతో ప‌లు రాష్ట్రాల్లోని బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ బ్యాంకుల నుండి హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రైవేట్ బ్యాంకుల వరకు ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకుల‌కు సెల‌వు ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపురలలో మాత్రమే గురువారం బ్యాంకులకు ఆర్బీఐ విడుద‌ల చేసిన ప్ర‌కారం సెలవు ఉంది. ఈ రాష్ట్రాల్లో రేపు ఆన్‌లైన్ బ్యాంకింగ్ యథావిధిగా కొనసాగుతుంది.