Top 10 viral news 🔥
పట్టపగలు నడిరోడ్డుపై యువతిని కత్తితో పొడిచి చంపాడు (వీడియో)
మహారాష్ట్రలోని పుణెలో పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు సహోద్యోగిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు. తీసుకున్న అప్పు.. ఇవ్వలేదని ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నడిరోడ్డుపై కత్తిపోట్లు చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ధైర్యంతో యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.