జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్‌లో హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు కబ్జాకు గురైనట్లు దేవదాయ శాఖ అధికారులు గుర్తించారు. పలు సార్లు నోటీసులు జారీ చేసినా ఎవరు స్పందించకపోవడంతో రంగంలోకి దిగిన అధికారులు జేసీబీలతో అక్రమంగా వెలసిన షెడ్డులను తొలగిస్తున్నారు. దీంతో స్థానికులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.